త్వరలో భారీ ప్రకటన చేయనున్న రజనీకాంత్ !


ప్రస్తుతం రజనీకాంత్ అభిమానుల్లో విడుదలకానున్న ఆయన సినిమాల పట్ల ఆసక్తికన్నా రాజకీయ పరంగా ఆయన చర్యలు ఎలా ఉండబోతున్నాయి, కొత్త ప్రకటన ఏమైనా చేస్తారా అనే ఉత్కంఠ ఎక్కువగా ఉంది. రాజకీయ వర్గాలు కూడ రజనీ నుండి పొలిటికల్ అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అనే ఎదురుచూస్తున్నారు. రజనీ కూడ ఒక భారీ ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు.

అదేమిటంటే ఏప్రిల్ 14 తమిళ కొత్త సంవత్సరం రోజున రజనీ పార్టీ జెండాను, పేరును అధికారికంగా అనౌన్స్ చేయనున్నారట. జెండాను ఇప్పటికే సిద్ధం చేయగా పేరును ఫైనల్ చేసే పనిలో ఉన్నారు రజనీ అండ్ టీమ్. ఇకపోతే రజనీ నటించితిన్ ‘కాలా’ చిత్రం ప్రిల్ 27న విడుదలకానుండగా ‘2 పాయింట్0’ కూడ విడుదలకు సిద్దమవుతోంది.