మల్టీస్టారర్లో రకుల్ ప్రీత్ సింగ్ ?
Published on Dec 14, 2017 9:26 am IST

‘స్పైడర్’ చిత్రం తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటి వరకు ఏ కొత్త సినిమాకు సైన్ చేయలేదు. పలు ప్రాజెక్ట్స్ ఆమె వద్దకు వెళుతున్నాఅవేవీ నచ్చకపోవడంతో ఆమె ఇంకా రిలాక్స్డ్ గానే ఉన్న ఆమెను ఒక ప్రాజెక్ట్ ఆకర్షిస్తోందట. అదే హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్న మల్టీస్టారర్.

హరీష్ శంకర్ ఈ స్టోరీని రకుల్ కు వినిపించారని, ఆమె కూడా ప్రాజెక్ట్ పట్ల సుముఖంగానే ఉన్నారని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఖచ్చితమైన వార్తేనని చెప్పే అధికారిక ప్రకటన అయితే ఇంకా ఏదీ రాలేదు. ఇకపోతే నితిన్, శర్వానంద్ లు హీరోలుగా చెప్పబడుతున్న ఈ ప్రాజెక్ట్ లో సాయి పల్లవి పేరు కూడా పరిశీలనలో ఉంది.

 
Like us on Facebook