పల్లెటూరి అమ్మాయిగా కనిపించనున్న రకుల్ ప్రీత్ సింగ్ !


టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం మహేష్ – మురుగదాస్ చిత్రంతో పాటు నాగ చైతన్య సినిమాలో కూడా నటిస్తోంది. ‘సోగ్గాడే చిన్ని నాయన ఫేమ్’ కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనుంది ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ మునుపెన్నడూ కనిపించని విధంగా కనిపిస్తుందట. ఇన్నాళ్లు పోష్, గ్లామరస్ రోల్స్ లో మాత్రమే మెప్పించిన రకుల్ ఇందులో మాత్రం ఒక అందమైన పల్లెటూరి అమ్మాయిగా నటిస్తోంది.

రొమాంటి ఎంటర్టైనర్ కావడంతో రకుల్ పాత్ర ఈ సినిమాకి చాలా కీలకంగా ఉండనుందట. అన్నపూర్ణ స్యుడియోస్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ అనే టైటిల్ ప్రస్తావనలో ఉంది. అలాగే ఇందులో ప్రముఖ నటుడు జగపతి బాబు కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.