అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చేసిన “రామ్‌ అసుర్”..!

Published on Jan 14, 2022 11:32 pm IST

అభినవ్ సర్దార్, రామ్ కార్తీక్ హీరోలుగా వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “రామ్ అసుర్”. అభినవ్, వెంకటేశ్‌ నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది నవంబర్‌ 19న విడుదలై పాజిటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

నేటి నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చినట్టు అధికారిక ప్రకటన వెలువడింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమాలో సుమన్, శుభలేఖ సుధాకర్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌, శెర్రి అగర్వాల్ త‌దిత‌రులు ముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :