“ఆర్ఆర్ఆర్” విడుదల వాయిదాపై రామ్‌ చరణ్‌ కామెంట్స్..!

Published on Jan 13, 2022 3:02 am IST

జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్రధాన పాత్రల్లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ అంచనాలున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగ జనవరి 7వ తేదిన రిలీజ్ కావాల్సి ఉన్నా ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా సినిమా విడుదలను వాయిదావేశారు. అయితే తాజాగా ‘రౌడీ బాయ్స్‌’ చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు చీప్ గెస్ట్‌గా వెళ్లిన రామ్‌ చరణ్‌ ఆర్ఆర్ఆర్ వాయిదాపై స్పందించారు.

అయితే సినిమా కోసం మూడున్నర సంవత్సరాలు చాలా కష్టపడ్డామని, మా సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్‌ అయినా కాకపోయినా మాకేం బాద లేదని అన్నారు. సరైన సమయంలో మూవీని విడుదల చేస్తామని రామ్‌ చరణ్ అన్నాడు. సంక్రాంతి మాకు ఎంత ముఖ్యమో మాకు తెలియదు కానీ దిల్ రాజుకు చాలా ముఖ్యమని అన్నారు. ఇలాంటి సక్సస్‌ ఫుల్‌ సంక్రాంతులు ఎన్నో దిల్‌ రాజు చూసాడు. ఈ సంక్రాంతి కూడా ఆయనదే అవ్వాలన్నాడు

సంబంధిత సమాచారం :