‘రంగ స్థలం’ రిలీజ్ డేట్ ఖరారు ?
Published on Nov 1, 2017 11:08 am IST

‘ధ్రువ’ సినిమా తరువాత చరణ్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం లో ‘రంగస్థలం’ అనే సినిమాలో నటిస్తున్నాడు, ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్‌గా స‌మంత న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే, పూజా హెగ్డే ప్ర‌త్యేక పాట‌లో అల‌రించ‌నుంది. దేవి శ్రీ‌ప్ర‌సాద్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అన‌సూయ‌, జ‌గ‌ప‌తి బాబు, ఆది పినిశెట్టిలు కీల‌క‌పాత్ర‌లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో వేసిన ఒక విలేజ్ సెట్ లో జరుగుతుంది.

ఈ క్ర‌మంలోనే ఆ గ్రామ సెట్ ఫొటోలు ఈ మద్య సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. మొదట ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావొచ్చని అనుకున్నారు, కాని అనివార్య కారణాల వల్ల సినిమా వాయిదా పడింది, తాజా సమాచారం మేరకు వేసవిలో విడుదల చెయ్యాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. అన్ని కుదిరితే మర్చి 29 న ‘రంగస్థలం’ థియేటర్స్ లో సందడి చెయ్యనుంది. సుకుమార్ తన మార్క్ లవ్ స్టోరి తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

 
Like us on Facebook