‘ఆచార్య’లో చరణ్ పాత్ర అలాగే ఉంటుందట !

Published on Mar 26, 2020 3:00 am IST

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న ఆచార్య సినిమాలోని ప్రత్యేక పాత్ర గురించి ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. ఆ పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నాడని.. లేదూ రామ్ చరణే స్వయంగా ఈ పాత్రలో నటిస్తున్నాడని ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోంది. కాగా ఈ చిత్రంలో రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపిస్తారట. సినిమాలో చరణ్ పాత్ర త్యాగం చేసే పాత్రగా ఉంటుందని, చిరు పాత్రకు చరణ్ పాత్ర ప్రేరణగా నిలుస్తోందని తెలుస్తోంది.

కాగా చరణ్ రోల్ సినిమాలో దాదాపు ఇరవై నిముషాల పాటు సినిమాలో కనిపిస్తారని.. అందులో పదిహేను నిముషాల పాటు మెగాస్టార్ తో కాంబినేషన్ సీన్స్ ఉంటాయని సమాచారం. ఇక మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారు. ఈ సినిమాలో మెగా అభిమానులు కోరుకునే అంశాలతో పాటు బోలెడంత హీరోయిజమ్ కూడా ఉండనుంది.

సంబంధిత సమాచారం :

X
More