గేమ్ ఛేంజర్: సూపర్ స్టైలిష్ అవతార్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్…ఫస్ట్ లుక్ రిలీజ్!

Published on Mar 27, 2023 3:21 pm IST


గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ ఛేంజర్. స్టార్ నటి కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ లు నిర్మిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ నేడు ఉదయం ఈ చిత్రం టైటిల్ ను రివీల్ చేయగా, దానికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం జరిగింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సూపర్ స్టైలిష్ గా ఉన్నారు. బైక్ పై కూర్చొని ఉన్న రామ్ చరణ్ నల్ల కళ్లద్దాలతో స్టైలిష్ హెయిర్ కట్, గడ్డం తో మునుపెన్నడూ లేని సరికొత్త అవతార్ లో కనిపిస్తున్నారు. చూస్తుంటే చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే ప్రతి ఒక్క సినిమా కూడా చాలా గొప్పగా, రిచ్ గా ఉంటుంది. రామ్ చరణ్ మ్యానరిజం, స్టైల్ తో ఈ సినిమా వేరే లెవెల్లో ఉండే అవకాశం ఉంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :