రామ్ రెమ్యునరేషన్ తగ్గించుకున్నాడట !

Published on Feb 6, 2019 3:51 pm IST

రామ్ గత చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’ హిట్ అయినా ప్రస్తుతం చేస్తున్న సినిమాకి తన రెమ్యూనరేషన్ తగ్గించుకున్నాడని టాక్ వస్తుంది. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం రామ్ , పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి పూరి సహా నిర్మాత కూడా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇటీవల పూరి ట్రాక్ రికార్డు అసలు బాగాలేదు ఆయన పేరుతో ఈ చిత్రానికి ఎక్కవ ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. అందుకని రామ్ కూడా తన వంతుగా పూరి ఫై ఎక్కువ భారం పడకుండా తన పారితోషికాన్ని తగ్గించుకున్నాడట. మాములుగా 3కోట్ల వరకు ఛార్జ్ చేసే రామ్ ఈచిత్రానికి అందులో సగం మాత్రమే అడిగాడట. కాని సినిమా మాత్రం చాలా క్వాలిటీ గా తీయాలని షరతు పెట్టాడట.

ఇక సినిమాకి హిట్ టాక్ వస్తే రామ్ కు పూర్తి స్థాయిలో రెమ్యూనరేషన్ ముట్టనుంది. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ హైద్రాబాద్లో జరుగుతుంది.

సంబంధిత సమాచారం :