రామ్ “ది వారియర్” ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే.!

Published on Jul 13, 2022 5:31 pm IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “ది వారియర్”. తమిళ మాస్ సినిమాల దర్శకుడు ఎన్ లింగుసామి తెరకెక్కించిన ఈ సాలిడ్ మాస్ పోలీస్ ఎంటర్టైనర్ చిత్రం కాగా మంచి అంచనాలు అయితే ఈ సినిమాపై ఎప్పుడు నుంచో నెలకొన్నాయి.

మరి వరుస బాక్సాఫీస్ హిట్స్ అనంతరం రామ్ చేసిన సినిమా కావడంతో ఈ సినిమాకి కూడా థియేట్రికల్ గా గట్టి బిజినెస్ నే జరిగినట్టుగా ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. మరి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అయితే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 37 కోట్లు బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తుంది.

ఇది రామ్ కెరీర్ లో అత్యధికం అని చెప్పాలి. మరి ఈ అంతా రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ డే సాలిడ్ ఓపెనింగ్స్ తో పాటుగా మంచి టాక్ కూడా తెచ్చుకోవాలని చెప్పాలి. మరి ఈ సినిమాకి అయితే ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :