కమల్ “విక్రమ్” పై రానా మాస్ కాంప్లిమెంట్స్!

Published on Jun 5, 2022 6:00 pm IST


కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజు దర్శకత్వం లో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ విక్రమ్. కమల్ హాసన్ గతం లో వచ్చిన విక్రమ్ మరియు ఖైదీ చిత్రాలను కలుపుతూ, మరో పవర్ ఫుల్ వరల్డ్ క్రియేట్ చేసిన లోకేష్ విక్రమ్ చిత్రం పై సర్వత్రా ప్రశంశల వర్షం కురుస్తోంది. ఈ చిత్రం ను చూసిన హ్యాండ్సం హంక్ రానా దగ్గుపాటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. చిత్రం పై, చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

విక్రమ్ చిత్రం లో కమల్ హాసన్ ను చూసి మ్యాడ్ గా వెళ్లినట్లు తెలిపారు. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫజిల్ లు పర్ఫార్మెన్స్ ట్రీట్ అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక డైరెక్టర్ లోకేష్ సరికొత్త క్రైమ్ వరల్డ్ ను క్రియేట్ చేసారు అని అన్నారు. సూర్య ప్యూర్ విజిల్స్ అంటూ చెప్పుకొచ్చారు. రానా దగ్గుపాటి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :