చైతూ “థాంక్యూ” టీజర్ పై రానా దగ్గుపాటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on May 26, 2022 6:02 pm IST

అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం థాంక్యూ. ఈ చిత్రం లో రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నెయిర్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అయితే నన్ను నేను సరి చేసుకోవటానికి నేను చేస్తున్న ప్రయాణమే థాంక్యూ అంటూ నాగ చైతన్య చెప్పుకొచ్చారు.

టీజర్ ను చూసిన టాలీవుడ్ హ్యండ్సం హంక్ రానా దగ్గుపాటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. నువ్వు ఆల్రెడీ సరి అయిపోయావు బ్రదర్, సూపర్ టీజర్ గాయ్ అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక థాంక్యూ టీమ్ కి బెస్ట్ విషెస్ తెలిపారు రానా. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూలై 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :