రానా “విరాట పర్వం” రిలీజ్ డేట్ పై మేకర్స్ క్లారిటీ!

Published on May 30, 2022 6:56 pm IST


టాలెంటెడ్ యాక్టర్ రానా దగ్గుబాటి తదుపరి చిత్రం విరాట పర్వం. నీది నాది ఒకే కథ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయిక గా నటిస్తుంది. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ పై మేకర్స్ ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని జూన్ 17, 2022 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల లో విడుదల చేస్తున్నట్లు ఒక మోషన్ పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఈ చిత్రం జులై 1, 2022 న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. సరికొత్త రిలీజ్ డేట్ పై ఇప్పుడు క్లారిటీ ఇవ్వడం తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిత్రంలో ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, ప్రియమణి, ఈశ్వరీరావు, రవి ఆనంద్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :