బాలక్రిష్ణ సినిమాకు ఓకే చెప్పిన రానా ?
Published on May 17, 2018 8:35 am IST


నందమూరి బాలక్రిష్ణ తన తండ్రి నందమూరి తారకరామారావుగారి జీవితం ఆధారంగా ‘ఎన్టీఆర్’ పేరుతొ బయోపిక్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అట్టహాసంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిగారి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది ఉంది. ఇకపోతే కొన్ని నెలల క్రితం ఈ చిత్రంలో ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడిగారి పాత్రను రానా చేయనున్నాడని వార్తలొచ్చాయి.

తాజా సమాచారం మేరకు ఆ వార్తలన్నీ నిజమేనని, రానా ఆ పాత్రను చేయడానికి ఒప్పుకున్నారని తెలుస్తోంది. అంతేగాక మే 28 ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఈ వార్తకు సంబందించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయట. మరి ఈ వార్తలో ఎంత మేరకు వాస్తవముందో తెలియాలంటే మే 28 వరకు ఆగాల్సిందే. మరోవైపు దర్శకుడు తేజ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న తర్వాత ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook