‘రానా’కు పుట్టినరోజు కానుక !

Published on Dec 13, 2018 10:46 pm IST

రేపు రానా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రబృందం రానాకు చిన్న పుట్టినరోజు కానుకను ఇచ్చింది. ఎన్టీఆర్ బయోపిక్ నుండి చంద్రబాబుగా రానా దగ్గుబాటి లేటెస్ట్ పోస్టర్ ను విడుదల చేసింది. చంద్రబాబు పాత్రలో రానా చాలా కొత్తగా కనిపిస్తున్నాడు.

కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. కాగా జనవరి 9న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను విడుదల చేసి, జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :