ట్రైలర్ టాక్ : మైండ్ బ్లోయింగ్ గా రణబీర్ కపూర్ ‘షంషేరా’ తెలుగు ట్రైలర్

Published on Jun 24, 2022 4:45 pm IST


తన మూవీ కెరీర్ లో వరుసగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకాభిమానులని అలరిస్తూ దూసుకెళ్తున్న బాలీవుడ్ లో స్టార్ యాక్టర్ రణబీర్ కపూర్ ప్రస్తుతం చేస్తున్న మూవీ షంషేరా. చారిత్రాత్మక కథాంశంతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన షంషేరా మూవీని ప్రఖ్యాత సంస్థ యాష్ రాజ్ ఫిలిమ్స్ వారు ఎంతో భారీ వ్యయంతో నిర్మించారు. హిందీ సహా పలు ఇతర సౌత్ భాషల్లో కూడా భారీ స్థాయిలో జులై 22న విడుదల కానున్న షంషేరా మూవీని కరణ్ మల్హోత్రా తెరకెక్కించగా వాణి కపూర్ ఇందులో హీరోయిన్ గా నటించింది.

రణబీర్ ద్విపాత్రాభినయం చేసిన షంషేరా తెలుగు థియేట్రికల్ ట్రైలర్ కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసారు.1800 వ శతాబ్దంలో బ్రిటిష్ వారిపై స్వతంత్రం కోసం పోరాడిన ఒక దొంగల జాతి కథగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ తెరకెక్కింది. షంషేరా అనే యోధుడిగా అలానే దొంగగా ఈ మూవీలో రణబీర్ కనిపించనున్నట్లు ట్రైలర్ ని బట్టి చూస్తే అర్ధం అవుతుంది. ముఖ్యంగా ట్రైలర్ లో రణబీర్ నటన, డైలాగ్స్, స్టైల్, భారీ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో అద్భుతంగా ఉండడంతో పాటు సినిమా చూడాలనే ఆసక్తిని అందరిలో ఎంతో పెంచుతాయి. సంజయ్ దత్ విలన్ గా నటించిన ఈ మూవీకి మిథూన్ మ్యూజిక్ అందిందించారు. ముఖ్యంగా ట్రైలర్ ని చూస్తే మనకి బాహుబలి, కెజిఎఫ్ లాంటి భారీ సినిమాలు గుర్తుకువస్తాయి. వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా అత్యధిక ఖర్చు, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిన షంషేరా మొత్తంగా సినిమాపై ఒక్కసారిగా అంచనాలు విపరీతంగా పెంచింది. మరొక నెల రోజుల్లో రిలీజ్ కానున్న షంషేరాతో రణబీర్ ఏ రేంజ్ సక్సెస్ కొడతారో చూడాలి.

వీడియో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :