రెండు భారీ వేడుకల్ని ప్లాన్ చేసిన ‘రంగస్థలం’ టీమ్ !
Published on Feb 20, 2018 11:23 am IST

‘రంగస్థలం’ సినిమా ప్రమోషన్స్ త్వరలో మొదలుకానున్నాయి. విడుదల తేది దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో, మరోవైపు షూట్ తో బిజీగా గడుపుతున్నారు. మార్చి 30 న ప్రేక్షకుల ముందుకురాబోతున్న ఈ సినిమా కోసం రెండు భారీ వేడుకలు ప్లాన్ చేశారు చిత్ర యూనిట్. ముందుగా వైజాగ్లో ఆడియో ఫంక్షన్ చేసి తర్వాత మార్చి 2వ వారంలో హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. త్వరలో ఆ వివరాలు వెల్లడికానున్నాయి.

చరణ్, సమంత జంటగా నటించిన ఈ సినిమాలో అనసూయ, జగపతిబాబు ప్రదాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఆది పినిశెట్టి చరణ్ బ్రదర్స్ గా నటిస్తోన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

 
Like us on Facebook