సెకండ్ షెడ్యూల్ కోసం లొకేషన్స్ వేట లో “#RAPO19”

Published on Sep 22, 2021 12:55 pm IST


రామ్ పోతినేని హీరోగా లింగస్వామి దర్శకత్వం లో ద్విభాషా చిత్రం గా తెరకెక్కుతున్న చిత్రం #RAPO19. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ను పెట్టలేదు. ఇటీవల హైదరాబాద్ లో లాంఛనం గా పూజ కార్యక్రమాల తో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా, ప్రస్తుతం రెండవ షెడ్యూల్ కోసం చిత్త యూనిట్ ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన లోకేషన్స్ వేట లో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా చిత్ర యూనిట్ లోకేషన్స్ కోసం వెతుకుతూ ఉన్న విడియో ను ఒకటి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం జరిగింది. చాలా గొప్ప కథలకు అందమైన ప్రాంతాలు కావాలి అంటూ చెప్పుకొచ్చారు.

రామ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం లో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం లో ఆది పినిశెట్టి కీలక పాత్ర లో నటిస్తున్నారు. ఈ చిత్రం ను వీలయిన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :