అరుదైన ఫీట్..సౌత్ నుంచి వరుస ఇండస్ట్రీ హిట్స్ పర్వం.!

Published on Jun 19, 2022 3:34 pm IST

మాములుగా పలు భారీ సినిమాలు వస్తున్నాయి అంటే వాటి ఫలితాన్ని ఆధారంగా హిట్ స్టేటస్ నుంచి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ వరకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. మరి అలా ఈ ఒక్క ఏడాదిలోనే మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర భారీ సినిమాలు రికార్డు వసూళ్లను కొల్లగొట్టి పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ ని రేపగా తెలుగు, తమిళ్ మరియు కన్నడ భాషల్లో వరుసగా గడిచిన మూడు నెలల్లో మూడు ఇండస్ట్రీ హిట్స్ నమోదు అవ్వడం ఆసక్తిగా మారింది.

మొదటగా మార్చ్ లో రిలీజ్ అయ్యిన మోస్ట్ అవైటెడ్ భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” రిలీజ్ అయ్యి మన తెలుగు స్టేట్స్ లో నెవర్ బిఫోర్ మార్జిన్ తో రికార్డు వసూళ్లు కొల్లగొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక దీని తర్వాత పాన్ ఇండియా లెవెల్లో అంతే అంచనాలుతో వచ్చి ఈ సినిమాతో సమాన వసూళ్లను అందుకున్న కన్నడ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా సెన్సేషనల్ హిట్ అయ్యి కన్నడలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఇక ఫైనల్ గా లేటెస్ట్ గా వచ్చిన చిత్రం “విక్రమ్” తమిళ నాట ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా అవతరించింది. అక్కడ ఇప్పటి వరకు ఇండస్ట్రీ హిట్ గా ఉన్న బాహుబలి 2 ని కమల్ మరియు లోకేష్ కనగ్ రాజ్ ల కాంబో బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దీనితో వరుసగా ఇంత తక్కువ గ్యాప్ లో ఒక్కో సౌత్ ఇండస్ట్రీలో ఒక్కో ఇండస్ట్రీ హిట్ నమోదు అవ్వడం ఒక అరుదైన ఫీట్ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :