అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ కోసం తండ్రి, హిందీ రీమేక్ కోసం కొడుకు !

Published on Feb 19, 2019 9:30 am IST

‘బాలా’, అర్జున్ రెడ్డి రీమేక్ నుండి తప్పుకున్నాక సినిమాను మళ్ళీ మొదటి నుండి ఉన్నతంగా నిర్మించేందుకు రెడీ అవుతున్నారు నిర్మాతలు. అందులో భాగంగా ఇంట్రెస్టింగ్ క్యాస్ట్ అండ్ క్రూ ను సెలక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకి ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ ‘అక్టోబర్’ ఫేమ్ భణిత సంధు హీరోయిన్ గా తీసుకోగా ఒరిజినల్ వెర్షన్ కి డైరెక్టర్ సందీప్ వంగ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన గిరీశయ్య ను డైరెక్టర్ గా తీసుకున్నారు. ఇక ఇప్పుడు తాజాగా లీడింగ్ సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ ను సెలెక్ట్ చేశారు. ధృవ్ విక్రమ్ హీరోగా నటించనున్న ఈచిత్రాన్ని ఈ4 ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించనుంది. సమ్మర్లో ఈచిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇక అర్జున్ రెడ్డి ప్రస్తుతం హిందీ లో కూడా రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్ డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘ఖబీర్ సింగ్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఈచిత్రానికి రవి కె చంద్రన్ తనయుడు సంతన కృష్ణన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :