రంగంలోకి దిగిన రవితేజ !
Published on Oct 15, 2017 1:11 pm IST

మాస్ మహారాజ రవితేజ చేస్తున్న తాజా చిత్రం ‘రాజా ది గ్రేట్’ ఈ నెల 18న రిలీజ్ కానుంది. దాదాపుగా రెండేళ్ల గ్యాప్ తర్వాత విడుదలవుతున్న రవితేజ చిత్రమిది. పైగా గత సినిమాలు వరుసగా పరాజయాలు పొంది ఉండటంతో ఈ చిత్రంతో తప్పనిసరి విజయాన్ని అందుకోవాలనే ఉద్దేశ్యంలో ఉన్నారు రవితేజ. అందుకు తగ్గట్టే పాటలు, ట్రైలర్ అన్నీ బాగుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ నెలకొంది.

అందరూ రవితేజ కమ్ బ్యాక్ చిత్రం ఎలా ఉంటుందో, చూపులేని వ్యక్తిగా రవితేజ ఎలా నటించారో చూడాలని ఆసక్తిగా ఉన్నారు. ప్రేక్షకుల్లో ఉన్న ఆ ఆసక్తిని ఇంకాస్త పెంచేందుకు, సినిమా మైలేజ్ ను రెట్టింపు చేసేందుకు రవితేజ స్వయంగా రంగంలోకి దిగి ప్రమోషన్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ టీవీ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్న అయన ఇంకో రెండు మూడు రోజుల పాటు ప్రమోషన్లలో పాల్గొంటారని తెలుస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించింది.

 
Like us on Facebook