రెండు ప్రాజెక్టులతో బిజీ కానున్న రవితేజ !
Published on Jul 23, 2016 9:42 am IST

ravi-teja
మాస్ మహారాజా రవితేజ చివరి చిత్రం బెంగాల్ టైగెర్ విడుదలైనతరువాత చాలా నెలలు గడిచినా మరో ప్రాజెక్టు ను ప్రారంభించలేదు.ఇక ఆలస్యం చేయకూడదనుకున్నాడో ఏమో కానీ వరుస ప్రాజెక్టు లను సిద్ధం చేసే పని లో పడ్డట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే రవితేజ రచయిత విక్రమ్ సిరి డైరెక్షన్ లో నటించేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజా గ అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ మరో ప్రాజెక్టు ను కూడా ఒకే చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అందించిన కథను రవితేజ ఒకే చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి డైరెక్టర్ గా బాబీ, రవివర్మ వంటి యువ దర్శకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

రవితేజ చివరి చిత్రం విడుదలై చాలా రోజులు గడుస్తున్న నేపథ్యం లో తన రెండు చిత్రాలను త్వరలో పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు. వీటి గురించిన మరిన్ని విశేషాలు త్వరలో తెలుస్తాయి.

 
Like us on Facebook