రవితేజ క్యారెక్టర్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !

రవితేజ క్యారెక్టర్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !

Published on May 10, 2022 2:43 AM IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ధమాకా’ రాబోతుంది. ఈ సినిమాకి ‘డబుల్ ఇంపాక్ట్’… అనేది ట్యాగ్ లైన్. అయితే, ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నాడు. అందులో ఒక పాత్ర నెగిటివ్ షేడ్స్ లో ఉంటుందని తెలుస్తోంది. ఇంటర్వెల్ కి ఈ నెగిటివ్ పాత్ర రివీల్ అవుతుందట.

ఇక రవితేజ రెండో పాత్ర కూడా చాలా కొత్తగా ఉంటుందట. కిక్ సినిమాలోని రవితేజ మళ్ళీ ఈ సినిమాలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజకు జోడీగా పెళ్లిసందడి ఫేమ్ ‘శ్రీలీల’ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలోని ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ‘శ్రీలీల’తో రవితేజ లవ్ ట్రాక్ సినిమాలోనే వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు