రవితేజను కావాలనే వివాదంలోకి లాగుతున్నారట !
Published on Jul 17, 2017 4:49 pm IST


టాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులలో స్టార్ హీరో రవి తేజ కూడా ఉన్నారు. ఆయనకు కూడా డ్రగ్ డీలర్ కేవల్విన్ తో సంబంధాలున్నట్లు వార్తలొచ్చాయి. ఎక్సయిజ్ శాఖ ఆయనకు విచారణకు హాజరుకావాలని నోటీసుకు కూడా పంపింది. ఈ విషయంపై రవితేజ ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ ఆయన తల్లి మాత్రం ఈ విషయంపై తీవ్ర స్థాయిలో స్పందించారు.

సోదరుడు చనిపోయిన బాధలో ఉండి కూడా నిర్మాతలు ఇబ్బందిపడకూడదని షూటింగులకు వెళుతున్నాడు. రవితేజకు కనీసం సిగరెట్ తాగే అలవాటు కూడా లేదు. చాలా మంచివాడు. నా కుమారుడ్ని కావాలనే ఈ వివాదంలోకి లాగుతున్నారు. మీడియా కూడా సరైన విచారణ చేయకుండా వార్తలను ప్రచురించువద్దు అన్నారు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook