బెల్లం కొండ గాల్లో తేలిపోతున్నాడట
Published on Aug 12, 2017 3:58 pm IST


బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా తొలి విజయాన్ని అందుకున్నాడు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘జయ జానకి నాయక’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మాస్ యాక్షన్ ఎటెర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం విజయం సాధించడంతో ఆ ఆనందాన్ని చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మీడియాతో పంచుకున్నారు.

ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ కు హీరో బెల్లం కొండ శ్రీనివాస్ గాల్లో తేలిపోతున్నాడని నిర్మాత అన్నారు. శ్రీనివాస్ కు సక్సెస్ అందించడం తనకు సంతోషాన్నిస్తోందని అన్నారు. అల్లు అరవింద్ వ్యక్తిగతంగా తనకు ఫోన్ చేసి అభినందించినట్లు ఆయన తెలిపారు. చిత్ర యూనిట్ కృషి వలనే ఈ విజయం సాధ్యమైందని రవీందర్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో బోయపాటి,తాను కలసి మరో సినిమా చేస్తామని అన్నారు.

 
Like us on Facebook