ఫస్ట్ లుక్ తో రాబోతున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ !

Published on Aug 26, 2018 10:31 am IST

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం చిత్రీకరణ దాదాపు చివరి దశలోకి వచ్చింది. కాగా తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఆగష్టు 27న అనగా రేపు సోమవారం నాడు విడుదల చేయబోతున్నామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

ఇక గత కొంత కాలంగా తెలుగు తెరకు దూరమైన ప్రముఖ హీరోయిన్ ఇలియానా మళ్ళి ఈ చిత్రంతోనే రీ ఎంట్రీ ఇస్తుంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది . గత కొంతకాలంగా శ్రీను వైట్ల, రవితేజ వరుస పరాజయాలతో సతమతవుతున్నారు. దాంతో ఈ చిత్రం ఈ ఇద్దరికీ చాలా కీలకం గా కానుంది. మరి ఈ చిత్రంతోనైనా హిట్ కొడతారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More