రవితేజ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ ?
Published on Nov 21, 2017 12:26 pm IST

‘రాజా ది గ్రేట్’ సినిమా తరువాత రవితేజ చేస్తోన్న సినిమా ‘టచ్ చేసి చూడు’ విక్రమ్ సిరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా సమాచారం ప్రకారం జనవరి 13 న ఈ సినిమాను విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ భావిస్తోందని తెలుస్తోంది. రాశి ఖాన్న , సీరత్ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కోనా వెంకట్ ఈ సినిమాకు కథ అందించడం జరిగింది. జనవరి లో సంక్రాంతి సందర్భంగా బాలకృష్ణ ‘జై సింహ’ పవన్ కళ్యాణ్ ‘అగ్నాతవాసి’ సినిమాలు విడుదల కానున్న సంగతి తెలిసిందే.

 
Like us on Facebook