మరొక పవర్ ఫుల్ పాత్రలో రవితేజ…”టైగర్ నాగేశ్వర రావు” టైటిల్ పోస్టర్ రిలీజ్

Published on Nov 3, 2021 3:00 pm IST

మాస్ మహారాజా రవితేజ వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ప్రతి సినిమా ఇతర చిత్రాలకు భిన్నంగా ఉండేలా చూసుకుంటారు రవితేజ. అంతేకాదు క్యారెక్టర్‌కి క్యారెక్టర్‌కి వైవిధ్యం చూపిస్తున్నారు. రవితేజ మరో అద్భుతమైన ప్రాజెక్ట్‌కు సంతకం చేసి, టైటిల్ పోస్టర్ ద్వారా నేడు అధికారికంగా ప్రకటించారు. టైగర్ నాగేశ్వరరావు అనే టైటిల్‌తో, ఇది 1970ల కాలంలో దక్షిణ భారతదేశంలోని అపఖ్యాతి పాలైన మరియు సాహసోపేతమైన దొంగ, మరియు స్టువర్ట్‌పురం ప్రజల వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. పవర్ ఫుల్ పాత్రలో నటించేందుకు రవితేజ పూర్తిగా మేకోవర్‌ చేసుకున్నారు. అతని బాడీ లాంగ్వేజ్, మరియు గెటప్ పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఈ చిత్రం తో రవితేజ ను మునుపెన్నడూ లేని విధంగా చూడబోతున్నాం.

ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహించనున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌ పై అభిషేక్ అగర్వాల్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథ యొక్క పరిధిని అర్థం చేసుకున్న మేకర్స్, పాన్ ఇండియా స్థాయిలో హై స్కేల్‌లో రూపొందించాలని నిర్ణయించుకున్నారు. ఇది రవితేజ యొక్క మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ మరియు ఇది తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో రూపొందించబడుతుంది.

టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఒక పర్ఫెక్ట్ సినిమా మెటీరియల్. ఇలాంటి మాస్ పాత్రలను పోషించడానికి రవితేజ ఖచ్చితంగా సరైన ఎంపిక. మోస్ట్ వాంటెడ్ థీఫ్ ఆఫ్ సౌత్ ఇండియా చిత్రానికి ఇది సరైన టైటిల్ అని చెప్పాలి.

టైటిల్ పోస్టర్ విషయానికి వస్తే, మనం కండలు మరియు కాళ్ళను చూడవచ్చు. రవితేజ యొక్క పాదాల గుర్తులు టైగర్ పావ్‌ ను సూచిస్తున్నాయి. ఇది పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉండనుంది అనేది తెలియజేస్తుంది. టైటిల్ ఎంత పవర్ ఫుల్ గా ఉందో, పోస్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

70ల నాటి కథ కావడం తో ప్రముఖ సాంకేతిక నిపుణులను ఈ ప్రాజెక్ట్‌లో కి తీసుకోవడం జరిగింది. R Madhie ISC ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా ఉండగా, GV ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :

More