జనవరి నుండి మొదలుకానున్న రవితేజ సినిమా !
Published on Oct 25, 2017 2:49 pm IST

దాదాపు రెండేళ్ల తర్వాత ‘రాజా ది గ్రేట్’ సినిమాతో స్క్రీన్ మీద కనబడిన మాస్ మహారాజ రవితేజ ఆ చిత్రంతో మంచి విజయాన్ని అందుకొని పూర్వ వైభవాన్ని తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగు స్టేట్స్ లో మంచి వసూళ్లతో నడుస్తోంది. దీంతో వరుసగా రెండు కొత్త సినిమాలకు సైన్ చేశారాయన. వీటిలో శ్రీనువైట్లతో ఒక ప్రాజెక్ట్ ఉండనుంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వెంకీ, దుబాయ్ శీను’ వంటి చిత్రాలు మంచి ఎంటర్టైనర్లుగా నిలవడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు మొదలయ్యాయి.

సినీ సర్కిల్స్ మాటల ప్రకారం ఈ సినిమా కూడా అలానే కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రాన్ని వచ్చేఏడాది జనవరి నుండి మొదలుపెట్టనున్నారు. ఈ చిత్రంతో పాటే ‘భోగన్’ రీమేక్లో కూడా ఒకేసారి నటించనున్నాడు రవితేజ. ఇక విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రూపొందుతున్న ‘టచ్ చేసి చూడు’ కూడా ఆఖరి దశల చిత్రీకరణలో జరుపుకుంటోంది.

 
Like us on Facebook