అఖిల్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” కి కూడా డేట్ ఫిక్స్.!

Published on Aug 28, 2021 10:00 am IST

ప్రస్తుతం మళ్ళీ టాలీవుడ్ లో అనేక చిత్రాలు రిలీజ్ కి అందులోని థియేట్రికల్ రిలీజ్ కి సన్నద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రానున్న రోజుల్లో పండుగలకు అనేక మోస్ట్ అవైటెడ్ చిత్రాలు డేట్స్ లాక్ చేసుకుంటున్నాయి. మరి అలా ఇప్పుడు దసరా రేస్ లో నిలిచేందుకు సన్నద్ధం అవుతున్నందున ఈ రేస్ లో అక్కినేని వారసుడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అఖిల్ నటించిన తాజా చిత్రం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” కూడా నిలిచింది.

దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ మరోసారి లాక్ డౌన్ వల్ల ఆగాల్సి వచ్చింది. మధ్యలో ఓటిటి అంటూ టాక్ వచ్చినా ఇప్పుడు మేకర్స్ ఈ చిత్రాన్ని వచ్చే అక్టోబర్ 8న రిలీజ్ చేస్తున్నట్టుగా ఫైనల్ క్లారిటీ ఇచ్చారు. మరి ఈ చిత్రాన్ని గోపి సుందర్ సంగీతం అందివ్వగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.అలాగే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :