‘భరత్ అనే నేను, నా పేరు సూర్య’ విడుదల తేదీల్లో మార్పు !
Published on Feb 22, 2018 5:23 pm IST

c

నిన్నటి వరకు సూపర్ స్టార్ మహేష్, కొరటాల శివ ‘భరత్ అనే నేను’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వక్కంతం వంశీల ‘నా పేరు సూర్య’ చిత్రాలు ఏప్రిల్ 26నాడే విడుదలవుతూ అభిమానుల్ని, డిస్ట్రిబ్యూటర్లకు కంగారు పెట్టించాయి. చాలా సినీ పెద్దలు, ట్రేడ్ విశ్లేషకులు ఇలా రెండు పెద్ద సినిమాలు ఒకే రోజున రిలీజవడమనేది ఆరోగ్యకరమైన పోటీ కాదని అభిప్రాయపడ్డారు.

దీంతో ఆలోచనలో పడిన ఇరు చిత్రాల నిర్మాతలు దానయ్య, లగడపాటి శ్రీధర్ ఇద్దరూ ఈరోజు సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం పోటీని విరమించుకుని రెండు సినిమాల మధ్యన కనీసం రెండు వారల గ్యాప్ ఉంటే మంచిదని భావించి విడుదల తేదీలను మార్చుకున్నారు.

కొత్త ప్రకటన ప్రకారం మహేష్ సినిమా కొంత ముందుకు జరిగి ఏప్రిల్ 20న విడుదలవుతుండగా బన్నీ చిత్రం వెనక్కు వెళ్లి మే 4న రానుంది. నిర్మాలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇద్దరూ కూడ బలపరిచారట.

 
Like us on Facebook