హింసాత్మకమైన ప్రేమ కథను నిర్మించనున్న ఆర్జీవీ !
Published on Jun 17, 2018 10:32 pm IST

ఇటీవలే ‘ఆఫీసర్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమా కొంచెం హింసాత్మకమైన ప్రేమ కథగా ఉండనుంది. అయితే ఈ సినిమాను వర్మ డైరెక్ట్ చెయ్యట్లేదు, భాస్కర్ రాశి అనే నిర్మాతతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు సిద్దార్థ డైరెక్ట్ చేయనున్నాడు.

ఇందులో కన్నడ నటుడు, ఇటీవలే ‘తగరు’ సినిమాతో బాగా పాపులర్ అయిన ధనంజయ హీరోగా నటిస్తున్నాడు. ప్రేమ కోసం భూస్వామ్య వ్యవస్థకు ఎదురుతిరిగే ఒక అనుచరుడి కథగా ఈ సినిమా ఉంటుందని వర్మ అన్నారు. ఈ చిత్రానికి ‘భైరవ గీత’ అనే టైటిల్ ను నిర్ణయించారు. రెండు భాషల్లో రూపొందనున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ జూన్ 21న విడుదలకానుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook