సీరత్ కపూర్ స్థానంలో రిచా పనాయ్ !
Published on Feb 19, 2018 3:35 pm IST

రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడిగా మారుతూ ఒక సినిమా చేయనున్న సంగతి విథితమే. ఈ చిత్రంలో నటుడు హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రలో నటించనున్నాడు. ముందుగా ఇందులో కథానాయకిగా సీరత్ కపూర్ ను అనుకున్నారు దర్శకనిర్మాతలు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయం మార్చుకుని సీరత్ స్థానంలో రిచా పనాయ్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట.

ఎందుకంటే కుటుంబ కథా చిత్రంగా ఉండనున్న ఈ చిత్రంలో తెలుగింటి అమ్మాయిగా రిచా పనాయ్ అయితే బాగుంటుందనేది వాళ్ళ ఉద్దేశ్యమట. అయితే ఈ వార్తపై ఇంకా మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడలేదు. సినిమాలో ఈ మార్పు గనుక జరిగే చాలా ఏళ్ల పాటు తెలుగులో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న రిచాకు ఇదొక మంచి అవకాశామనుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ కూడ ఒక కీలక పాత్రలో నటించనున్నాడు.

 
Like us on Facebook