“రైజ్ ఆఫ్ శ్యామ్” లిరికల్ వీడియో విడుదల కి సిద్దం!

Published on Nov 5, 2021 3:15 pm IST


నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం శ్యామ్ సింగ రాయ్. ఈ చిత్రం లో సాయి పల్లవి, కీర్తీ సురేష్, మడోన్నా సెబాస్టియన్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల విడుదల తేదీని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. వచ్చే నెల 24 వ తేదీన విడుదల అవుతుండటం తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది.

ఈ మేరకు రైజ్ ఆఫ్ శ్యామ్ లిరికల్ వీడియో ను విడుదల చేసేందుకు సిద్దం అయింది. ఈ వీడియో ను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ మరొక పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు చిత్రం పై ఆసక్తిని పెంచేశాయి. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :