హాలీవుడ్ కన్నా గొప్ప స్థాయిలో ‘రోబో-2’ !

హాలీవుడ్ కన్నా గొప్ప స్థాయిలో ‘రోబో-2’ !

Published on Oct 8, 2017 6:31 PM IST


‘బాహుబలి-2’ విజయం తర్వాత ఇండియన్ సినిమా ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు భారీ స్థాయిలో సినిమాల్ని నిర్మించాలనుకున్న దర్శక నిర్మాతలు సాంకేతికంగా కూడా ప్రపంచస్థాయి సినిమాల్ని తీయాలని నిర్మయించుకున్నారు. అలాంటి వాటిలో మొదటి చిత్రం రజనీ ‘రోబో-2’. ఆరంభం భారీ స్థాయిలోనే అయినా కూడా సాంకేతికత సాధించి పెట్టే విజయాన్ని ‘బాహుబలి’ రూపంలో చూసిన నిర్మాతలు, దర్శకుడు శంకర్ ఆ తర్వాత ఇంకో అడుగు ముందుకేస్తూ చిత్రాన్ని త్రీడీలో కూడా రూపొందించారు.

అది కూడా నేరుగా షూటింగ్ సమయంలోనే త్రీడి కెమెరాలను ఉపయోగించి చిత్రీకరించడం విశేషం. ఇది చాలా హాలీవుడ్ సినిమాల్లో ప్రయత్నించని విధానమాట. అంతేగాక ఈ చిత్రానికి 4డీ సౌండ్ ఎఫెక్ట్స్ ను కూడా వినియోగిస్తున్నారు. రూ.400 కోట్లకు పైగానే బడ్జెట్ ను కేటాయించి అత్యుత్తమ సాంకేతిక బృదంతో రూపొందిన ఈ చిత్రం చాలా హాలీవుడ్ సినిమాలకన్నా గొప్ప స్థాయిలో ఉంటుందని అంటున్నారు. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన, భారితీయ సినీ ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం తప్పకుండా కొత్త రికార్డుల్ని క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు