జపాన్ లో హిస్టరీ క్రియేట్ చేసిన “RRR”.?

జపాన్ లో హిస్టరీ క్రియేట్ చేసిన “RRR”.?

Published on Dec 11, 2022 9:00 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శకుడు రాజమౌళి తీసిన లేటెస్ట్ సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కోసం ప్రపంచ వ్యాప్త ఆడియెన్స్ కి తెలిసిందే. మరి ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కడో చోట ఈ చిత్రానికి ఆదరణ లభిస్తూనే ఉంది. అయితే ఈ చిత్రాన్ని జపాన్ లో కూడా డబ్ చేసి గత అక్టోబర్ లో రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

మరి ఈ రిలీజ్ తర్వాత అయితే అక్కడ ఈ చిత్రం ఫాస్టెస్ట్ ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్ గా స్టాండ్ అయ్యింది. అయితే మరి ఇది వరకే బాహుబలి 2 ని క్రాస్ చేసేసి నెంబర్ 1 స్థానంలో నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు అయితే జపాన్ లో ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ అయినటువంటి ముత్తు చిత్రాన్ని క్రాస్ చేసి నెంబర్ 1 ఇండియన్ గ్రాసర్ గా హిస్టరీ క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక అప్డేట్ ఇంకా రాలేదు కానీ ప్రస్తుతం అయితే ఈ టాక్ నడుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు