మాస్ “RRR”..జస్ట్ ప్రోమోతోనే వేరే లెవెల్ చూపించిన రాజమౌళి!

Published on Nov 9, 2021 11:56 am IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు మన తెలుగు స్టేట్స్ లో ఎంతటి మాస్ క్రౌడ్ పుల్లర్స్ అనేది అందరికీ తెలుసు. మాస్ ఆడియెన్స్ లో వీళ్ళ క్రేజ్ కూడా స్పెషల్. అలాంటిది ఈ ఇద్దరితో పాన్ ఇండియా లెవెల్ మాస్ చూపించగల దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తీసిన భారీ పాన్ ఇండియా మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”.

ఎనలేని అంచనాలు ఉన్న ఈ మాసివ్ ప్రాజెక్ట్ నుంచి రెండో పాట “నాటు నాటు” అనే మాస్ బీట్ ని కొన్ని రోజులు కితమే అనౌన్స్ చేసి దాని ప్రోమోని ఇప్పుడు మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది మాత్రం సింపుల్ గా అవుట్ స్టాండింగ్ అని చెప్పాలి. రాజమౌళి సినిమాలకి కీరవాణి ఎందుకు అంత స్పెషల్ అంటే ఈ ప్రోమో సమాధానం ఇస్తుంది.

పక్కా ఊర మాస్ బీట్ లో ఈ ప్రోమో అద్దిరిపోయింది. ఇక తన హీరోలను రాజమౌళి ఎలా చూపిస్తారో తెలిసిందే. పైగా చాలా కాలం తర్వాత తన హీరోలతో డాన్స్ చేపిస్తున్నారు ఇక ఇదంతా వేరే లెవెల్లో ఉండటం కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఇక మిగిలింది అంతా రేపు సాయంత్రం 4 గంటలకి ఈ సాంగ్ కోసం ఎదురు చూడాల్సిందే తరువాయి.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :

More