ఫస్ట్ డేట్ కి “RRR” రావట్లేదు..కారణం ఇదే..!

ఫస్ట్ డేట్ కి “RRR” రావట్లేదు..కారణం ఇదే..!

Published on Jan 27, 2022 12:40 PM IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ లు హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తీసిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా “రౌద్రం రణం రుధిరం” కోసం తెలిసిందే. ఆల్రెడీ అన్ని పనులు కంప్లీట్ అయ్యి జస్ట్ థియేటర్స్ లో రిలీజ్ కోసం సిద్ధంగా ఉంది. అయితే మొన్న జనవరి 7న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా తీవ్రత వల్ల ఆగిపోయింది.

ఇక కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడా అనుకుంటున్నా సమయంలో మేకర్స్ ఏకంగా రెండు రిలీజ్ డేట్స్ ని అందించారు. మరి మార్చ్ 18 ఒకటి కాగా ఇంకొకటి ఏప్రిల్ 28 గా ఫిక్స్ చేసారు. అయితే ఇప్పుడు వీటిలో మార్చ్ 18 డేట్ ని అభిమానులు మూవీ లవర్స్ తమ లిస్ట్ నుంచి తీసెయ్యొచ్చు అని చెప్పొచ్చు. మరి దీనికి బలమైన కారణం కూడా ఉంది.

ఈ మార్చ్ “RRR” రిలీజ్ వారం లోనే కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటుడు స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ తాజా సినిమా “జేమ్స్” ని విడుదల చేయాలని ఫిక్స్ చెయ్యగా ఆ వారం అంతలో కూడా వేరే ఏ సినిమాని కూడా రిలీజ్ చెయ్యకూడదని అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ఫిక్స్ అయ్యారట. దీనితో అన్ని భాషల్లో ప్లాన్ చేసిన ఈ సినిమా ఆగిపోయినట్టే అని చెప్పాలి. ఇక మిగిలి ఉంది ఏప్రిల్ 28 కాబట్టి ఆ డేట్ కే విడుదల కావడం కన్ఫర్మ్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు