‘బాహుబలి-2’ రన్ టైమ్ ఎంతో తెలుసా !
Published on Apr 18, 2017 12:05 pm IST


భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘బాహుబలి – ది కంక్లూజన్’ ఒక్కొక్కటిగా అన్ని పనుల్నీ పూర్తి చేసుకుని రిలీజుకు సిద్దమవుతోంది. అందులో భాగంగా నిన్న సాయంత్రం ఈ చిత్రం యొక్క సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ప్రత్యేకంగా షోను చూసి చిత్రాన్ని U/A సర్టిఫికెట్ జారీ చేశారు.

అలాగే సినిమా యొక్క రన్ టైం 2 గంటల 47 నిముషాలుగా ఉందని కూడా తెలుస్తోంది. సిరీస్ లోని అసలు కథంగా ఈ రెండవ భాగంలోనే జరగనుండటంతో చాలా పాత్రలు, సన్నివేశాలు, ఒక ఫ్లాష్ బ్యాక్, ఒక ప్రస్తుతం, భారీ యుద్ధ సన్నివేశాలు ఉంటాయి కనుక రన్ టైమ్ రెగ్యులర్ సినిమాలకన్నా కాస్త ఎక్కువగా ఉంటుందట. ఇకపోతే ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుండగా ఒక్క ఇండియాలోనేసుమారు 6500 స్క్రీన్లలో విడుదలచేయనున్నారు.

 
Like us on Facebook