రిటైర్మెంట్ ప్రకటించిన ఎస్. జానకి !
Published on Oct 23, 2017 4:58 pm IST


భారేదేశంలోని ప్రముఖ గాయనీల్లో సీనియర్ గాయకురాలు ఎస్.జానకి ఒకరు. దాదాపు 17 భారతీయ భాషల్లో కొని వేల పాటలు పాడారామె. ముఖ్యంగా తెలుగు, తమిళము, కన్నడం, మలయాళం, హిందీ, పంజాబీ భాషల్లోని పాటలు ఆమెకు గొప్ప పేరును తెచ్చి పెట్టాయి. దాదాపు 65 ఏళ్ల పాటు శ్రోతల్ని, సంగీత ప్రియుల్ని అలరించిన ఆమె త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించనున్నారు. ఇది ఆమె అభిమానులకు బాధ కలిగించే విషయమే.

దగ్గర దగ్గర 80 ఏళ్ల వయసున్న ఆమె వయసు పైబడటంతో పాడటం కష్టంగా ఉందని, ఇకపై పాడలేనని అందుకే విశ్రాంతి తీసుకోవాలనుకున్నట్లు తెలిపారు. 65 ఏళ్ల క్రితం తాను గాయనిగా కెరీర్ ను ప్రారంభించిన మైసూరులోనే చివరి కచేరి ఇచ్చి విరమించాలనుకుంటున్నట్లు కూడా తెలిపారు. ఆమె చివరి కచేరీ ఈ నెల 28న మానస గంగోత్ర్రి ఓపెన్ స్టేడియంలో జరగనుంది.

 
Like us on Facebook