ఈ స్టార్ దర్శకునితో బన్నీ సినిమాపై క్లారిటీ.!

Published on Jun 19, 2022 3:00 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తో “పుష్ప ది రూల్” కోసం సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో డెఫినెట్ గా అనేక రికార్డులు నెలకొల్పుతుంది అని అంతా అనుకుంటున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా అనంతరం ఐకాన్ స్టార్ లైనప్ పై రీసెంట్ గా టాక్ కూడా వినిపించింది. అయితే ఓ రూమర్ మాత్రం అల్లు అర్జున్ అభిమానుల్లోకి బాగా వెళ్ళింది. నెక్స్ట్ అల్లు అర్జున్ ప్రెజెంట్ సౌత్ ఇండియా సెన్సేషన్ గా మారిన లోకేష్ కనగ్ రాజ్ తో సినిమా చేస్తాడని పలు రూమర్స్ వచ్చాయి.

మరి ఇప్పుడు దీనిపై అయితే క్లారిటీ తెలుస్తుంది. అసలు ఈ టాక్ లో ఎలాంటి నిజం లేదట. లోకేష్ కి ఉన్న కమిట్మెంట్స్ లో అల్లు అర్జున్ తో సినిమా అనేది అందులోని అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాగానే వస్తుంది అనేది అసలు లేదట. సో ఈ టాక్ లో మాత్రం ఎలాంటి నిజం లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం :