ఫిల్మ్ సిటీలో ‘సాహో’ నలభై రోజులకు పైగా లాంగ్ షెడ్యూల్‌ !

Published on Jul 31, 2018 9:25 am IST

ప్రభాస్‌ హీరో శ్రద్ధాకపూర్‌ హీరోయిన్ గా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించి కీలకమైన సన్నివేశాల్ని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం కోసం వేసిన మార్కెట్‌ సెట్‌ లోనే ప్రస్తుతం షూటింగ్ జరుగుతొంది. కాగా ఈ షూటింగ్ లో శ్రద్ధాకపూర్‌ తో పాటు కొంతమంది నటీనటులు పాల్గొంటుండగా.. నలభై రోజులకు పైగా ఈ షెడ్యూల్‌ జరగనుంది. కీలకమైన సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలను కూడా తెరకెక్కించనున్నారు.

‘రన్ రాజా రన్’ ఫెమ్ సుజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యు వి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి

సంబంధిత సమాచారం :