విషాదం..ఓటిటి స్టార్ మనోజ్ బాజ్ పాయి తండ్రి మృతి!

Published on Oct 3, 2021 1:50 pm IST


ఇండియన్ వెబ్ కంటెంట్ దగ్గర దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిట్ సిరీస్ అయినటువంటి “ది ఫ్యామిలీ మ్యాన్” లో మెయిన్ లీడ్ లో కనిపించిన నటుడు మనోజ్ బాజ్ పాయి సినిమాల్లో నటించిన దానికంటే ఎక్కువ ఈ సిరీస్ తో ఫేమ్ తెచ్చుకున్నారు. మరి దానికి సీక్వెల్ తో మంచి హిట్టయ్యి మరిన్ని ఆఫర్స్ తో బిజీగా ఉన్న తన ఇంట ఇప్పుడు విషాదం నెలకొంది.

తన తండ్రి ఆర్ కె బాజ్ పాయి ఈరోజు ఉదయం అనారోగ్య వయసుకి సంబంధించిన అనారోగ్య సమస్యలతో ఆయన 83వ ఏట తుది శ్వాస విడిచారు.. అయితే గత కొన్ని రోజులు కితమే తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదు అని తెలిసిన వెంటనే తన అన్ని షూటింగ్స్ ఆపుకొని హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కానీ ఇప్పుడు ఇన్ని రోజుల పోరాటంలో ఈ విషాద వార్తను వినక తప్పలేదు. మరి ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మా 123తెలుగు బృందం నివాళులు అర్పిస్తోంది.

సంబంధిత సమాచారం :