మెగా మేనల్లుడితో యంగ్ టాలెంటడ్ డైరెక్టర్ !

Published on Aug 15, 2018 7:00 pm IST


మరో మెగా మేనల్లుడి సినీరంగ ప్రవేశానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్‌ తేజ్ హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవ్వడానికి రెడీ అయిపోయాడు. ఇప్పటికే మెగా అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణ‌వ్ తేజ్‌ కూడా ఎప్పటి నుంచో హీరో అవ్వాలని అనుకుంటున్నాడు. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం వైష్ణ‌వ్ తేజ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కతుంది.

‘నేల టిక్కెట్టు’ నిర్మాత రామ్ తాళ్లూరి వైష్ణ‌వ్‌ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ దర్శకుడు సాగర్‌ కె. చంద్రతో దర్శకత్వంలో వైష్ణ‌వ్‌ తేజ్ నటిస్తున్నాడు. ఇప్పటికే సినిమాలోని కొంత భాగం షూట్ కూడా చేశారట. అయితే ఈ చిత్రం గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వైష్ణ‌వ్ సినిమా పూర్త‌య్యాక‌ సాయిధ‌ర‌మ్ తేజ్ తోనూ రామ్ తాళ్లూరి ఓ సినిమా నిర్మించనున్నారు

సంబంధిత సమాచారం :

X
More