‘పవన్ కళ్యాణ్’ను ఫాలో అవుతున్న ‘సాయి ధరమ్ తేజ్’ !


సాయి ధరమ్ తేజ్ తన తాజా చిత్రం ‘తేజ్ ఐలవ్యూ’ చిత్ర ప్ర‌మెష‌న్‌ కోసం వైజాగ్ వెళ్లారు. తేజ్ అక్కడి సినిమా కార్యక్రమాలను ముగించుకొని తిరిగి హైద‌రాబాద్‌ కి రావడానికి విమానాశ్ర‌మానికి వచ్చారు. అంతలో తన అభిమాని అయిన బంగార‌మ్మ అనే యువతి తనని కలవాలని కోరిందని, ఆమె గత కొంతకాలంగా కేన్స‌ర్‌ తో బాధపడుతుందని తెలుసుకున్న సాయి ధరమ్ తేజ్, అక్కడున్న తన అభిమానుల ద్వారా బంగార‌మ్మను నేరుగా విమానాశ్ర‌మానికి పిలిపించారు. బంగారమ్మతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఆమె యోగక్షేమాలు గురించి అడిగి తెలుసుకున్నారు.

పాండ్రంగి అనే గ్రామానికి చెందిన బంగార‌మ్మ బోన్ కేన్స‌ర్‌ వల్ల తీవ్ర ఇబ్బంది పడుతుంది. ట్రీట్‌మెంట్‌ లో భాగంగా ఆమెకు ఓ కాలును కూడా తొలిగించారు. ఐతే సాయి ధరమ్ తేజ్ ఆమెకు ధైర్యం చెప్తూ నా సహాయసహాకారాలు ఎప్పుడు ఉంటాయని ఆమెను ఓదార్చారు. త్వరగా బంగార‌మ్మ ఆరోగ్యం పూర్తిగా నయమవ్వాలని తేజ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెగా అభిమానులు కూడా ఆమె ఆరోగ్యం కోసం ప్రార్ధ‌న చేయాల‌ని కోరారు. కాగా పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాల్లో ఇలాగే స్పందించిన ఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు తేజ్ అచ్చం పవన్ లాగే స్పందించడం నిజంగా విశేషమే.