రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన సాయి పల్లవి !

Published on Jan 8, 2019 8:50 am IST


శర్వానంద్ , సాయి పల్లవి నటించిన రొమాంటిక్ ఎంటర్టైనెర్ ‘పడి పడి లేచె మనసు’ ఇటీవల విడుదలై అనుకున్నంతగా విజయం సాదించలేకపోయింది. దాంతో ఈ చిత్ర నిర్మాతలకు సాయి పల్లవి తను తీసుకున్న రెమ్యూనరేషన్ ను వెనక్కి ఇచ్చేసిందట. ఇండస్ట్రీ లో స్టార్ హీరోలు తమ సినిమాలు బాగా ఆడనప్పుడు ఈ వింధంగా రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన సందర్బాలు చాలానే చూసాం. కానీ ఒక హీరోయిన్ కూడా నిర్మాత గురించి అలోచించి తన పారితోషికాన్ని తిరిగి ఇచ్చేయడం బహుశా ఇదే మొదటి సారి అనుకుంటా.

ఇక ఈసినిమాకి గాను నటన విషయంలో శర్వానంద్ , సాయి పల్లవి కి చాలా మంచి పేరు వచ్చింది. వారిద్దరూ సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసిన ఎందుకో ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. ఇక సాయి పల్లవి ప్రస్తుతం తమిళంలో సూర్య సరసన ఎన్ జి కె చిత్రంలో నటిస్తుంది.

సంబంధిత సమాచారం :