సెన్సార్ కంప్లీట్ చేసుకున్న సాయి తేజ్ “రిపబ్లిక్”..!

Published on Sep 18, 2021 5:46 pm IST

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల ఒక రోడ్డు ప్రమాదానికి గురయ్యిన సంగతి తెలిసిందే. అలాగే ప్రస్తుతం చికిత్స పొందుతూ మెల్లమెల్లగా కోలుకుంటున్నాడు. మరి ఇదిలా ఉండగా అంతకన్నా ముందే విలక్షణ దర్శకుడు దేవా కట్టా తో చేసిన సినిమా “రిపబ్లిక్” ని కంప్లీట్ చేసేసాడు. అలాగే దీనిని రిలీజ్ కి కూడా రెడీ చేసేసారు. మరి ఈ చిత్రం ఇప్పుడు సెన్సార్ ని కంప్లీట్ చేసుకున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

మరి ఈ చిత్రం యూ/ఏ సర్టిఫికెట్ వచ్చినట్టుగా తెలిపారు. అలాగే ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే అక్టోబర్ 1నే రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. మరి ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుండగా రమ్య కృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే మణిశర్మ సంగీతం అందిస్తుండగా జేబీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :