సెన్సార్ పూర్తి చేసుకున్న శైలజారెడ్డి అల్లుడు !

Published on Sep 10, 2018 2:03 pm IST

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈచిత్రానికి ఒక్క కట్ కూడా చెప్పకుండా సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. మారుతీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చైతుకి జోడిగా అను అమ్మాన్యుయేల్ నటించగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ శైలజారెడ్డి పాత్రలో కనిపించనుంది. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సితారఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.

ఇక ఈ చిత్రంలో నాగ చైతన్య మొదటిసారి డిఫ్రెంట్ బాడీ లాంగ్వేజ్ తో కనిపించనున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానున్న ఈచిత్రం ఫై మంచి అంచనాలే వున్నాయి. వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 13న భారీ స్థాయిలో విడుదల కానుంది ఈ చిత్రం.

సంబంధిత సమాచారం :