బాలయ్య మాస్ ఇమేజ్ తో ‘సలార్’ నటుడు పృథ్వీరాజ్ క్రేజీ ప్లానింగ్

బాలయ్య మాస్ ఇమేజ్ తో ‘సలార్’ నటుడు పృథ్వీరాజ్ క్రేజీ ప్లానింగ్

Published on Mar 27, 2024 3:50 PM IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా దర్శకుడు కొల్లి బాబీతో సాలిడ్ ప్రాజెక్ట్ (NBK 109) చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది బాలయ్య కెరీర్ లో 109వ సినిమా కాగా దీనిపై భారీ హైప్ ఉంది. ఇక దీని తర్వాత బాలయ్య నుంచి మరింత స్ట్రాంగ్ అండ్ ప్రామిసింగ్ లైనప్ వస్తుండగా వాటిలో ఒక క్రేజీ కాంబినేషన్ పై కొత్త ఆశలు చిగురించాయి. బాలయ్య మాస్ ఇమేజ్ ఏపాటిదో అందరికీ తెలుసు.

మరి ఈ ఛరిష్మాతో బాలయ్యని ఓ రేంజ్ లో చూపించాలి అనుకుంటున్నట్టుగా మళయాళ స్టార్ నటుడు మరియు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) రీసెంట్ గా చేసిన సాలిడ్ కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. బాలకృష్ణ గారి ఇమేజ్ కి మళయాళ సినిమా స్టైల్ లో ఒక ప్రాపర్ సహజమైన సినిమా చేయాలని తాను అనుకుంటుంన్నాను అని రివీల్ చేసాడు.

ఆల్రెడీ ఆయనతో ఓసారి డిస్కషన్ కూడా పెట్టినట్టుగా తాను తెలిపాడు. మరి అన్నీ కుదిరి ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో కాలమే నిర్ణయించాలి. మరి “సలార్” (Prabhas’s Salaar) సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్ కి మరింత దగ్గరైన పృథ్వీ ఇప్పుడు తన “గోట్ లైఫ్ ఆడు జీవితం” తో పాన్ ఇండియా రిలీజ్ కి రాబోతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు