స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ ని లాక్ చేసుకున్న “సలార్ సీజ్ ఫైర్”

స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ ని లాక్ చేసుకున్న “సలార్ సీజ్ ఫైర్”

Published on Dec 22, 2023 10:07 AM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కించిన ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్ సీజ్ ఫైర్” ఇప్పుడు రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. మరి ప్రభాస్ నుంచి మరో మోస్ట్ హైప్డ్ సినిమాగా ఇది రిలీజ్ కాగా ఈ సినిమాని ఆడియెన్స్ నుంచి ఫ్యాన్స్ నుంచి సాలిడ్ టాక్ అయితే నమోదు అయ్యింది.

ఇక ఈ చిత్రం పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ ఓటిటి కి సంబంధించి డీటెయిల్స్ ఇపుడు కన్ఫర్మ్ అయ్యాయి. అయితే ఈ సినిమా ఓటిటి హక్కులని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. దీనితో సలార్ థియేటర్స్ తర్వాత ఇందులో వీక్షించవచ్చు. ఇక ఈ భారీ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందించగా హోంబాళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు